News January 8, 2026
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు

AP: రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో పదెకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు గవర్నర్ జస్టిస్ నజీర్, CM చంద్రబాబు సహా 500 మంది అతిథులు హాజరవనున్నారు.
Similar News
News February 16, 2026
మహిళలూ ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో వృత్తి, ఉద్యోగాల కారణంగా మహిళలు క్యాబ్స్‌లో ప్రయాణించడం ఎక్కువైంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డ్రైవర్ ఐడీ, లైసెన్స్ ప్లేట్ మీరు బుక్ చేసిన డేటాతో సరిపోలాలి. ట్రిప్ వివరాలు, లైవ్ ట్రాకింగ్ సన్నిహితులకు పంపడం మంచిది. గుర్తింపు ఉన్న క్యాబ్ సర్వీసులనే ఎంచుకోవాలి. పరిసరాలు గమనిస్తూ అలర్ట్‌గా ఉండాలి. వెనుక సీట్‌లోనే కూర్చోవాలి. తెలియనివారికోసం డోర్లు తెరవకూడదు.
News February 16, 2026
విప్ ఇద్దామంటే BRSకు దొరకని ఆ MLAలు

TG: హంగ్ ఏర్పడ్డ మున్సిపాల్టీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా MLA, MLC, MP ఓట్లు కీలకంగా మారడంతో పార్టీలు వారికి విప్ జారీ చేస్తున్నాయి. వాటిని వ్యక్తిగతంగా అందించి సంతకాలు కూడా తీసుకోవాలి. BRSకు ఇదే తలపోటుగా మారింది. INCకి సన్నిహితంగా ఉంటున్న MLAలకు విప్ ఇద్దామంటే పార్టీకి వారెవరూ అందుబాటులో లేరు. వారెవరూ విప్ అందుకోలేదు. గద్వాల వంటి చోట్ల BRS MLAనే INC అభ్యర్థిని ఛైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు.
News February 16, 2026
ఒకే గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మృతి

హరియాణాలోని చాయన్సలో 15 రోజుల్లో 12 మరణాలు కలకలం రేపాయి. వీరిలో ఐదుగురు స్కూల్ విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, వాంతులతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తాగునీరు కలుషితం కావడమే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. 107 ఇళ్లలో వాటర్ శాంపిల్స్ సేకరించగా 23 చోట్ల బాక్టీరియా పెరుగుదల, క్లోరినేషన్ తక్కువగా ఉందని గుర్తించారు.


