News January 7, 2026

అమరావతిలో నేటి నుంచి మరోసారి ల్యాండ్ పూలింగ్

image

అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం బుధవారం నుంచి మరోసారి భూసమీకరణ ప్రారంభించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమానులో 1,937 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,428 ఎకరాలు, కాగా పల్నాడు(D) అమరావతి మండలంలోని వైకుంఠపురం 3,361 ఎకరాలు, పెదమద్దూరు 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166, కర్లపూడి-లేమల్లె 2,944 ఎకరాలుగా సమీకరణ చేయనుంది.

Similar News

News February 20, 2026

TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల

image

TG: రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు TG EDCET-2026 నోటిఫికేషన్ రిలీజైంది. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో CBT విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. మే 12వ తేదీ 2 సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం 50 మార్కులతో బ్యాచ్‌లర్ డిగ్రీ ఉన్నవాళ్లే అప్లై చేసుకునేందుకు అర్హులు.

News February 20, 2026

గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: నిర్మల్ డీఈవో

image

నిర్మల్ జిల్లాలో ఈనెల 22న ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్ష అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశం కోసం జిల్లా వ్యాప్తంగా 6984 పంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News February 20, 2026

టెన్త్ స్టూడెంట్ల పేర్లలో తప్పుల సవరణకు ఛాన్స్

image

AP: టెన్త్ విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, జెండర్ వివరాల్లో తప్పులుంటే స్కూళ్ల ఐడీల ద్వారా HMలు ఈనెల 21లోపు సరిచేయాలని బోర్డు సూచించింది. బోర్డు అందించే లింకుల్లో వీటిని సమర్పించాలంది. కరెక్షన్స్‌ను విద్యార్థులు, పేరెంట్స్ కూడా సరిచూసుకోవాలని పేర్కొంది. ఈ పరీక్షలకు 6 లక్షల మంది హాజరుకానున్నారు.