News November 15, 2025
అమరావతిలో భారీగా పెట్టుబడులు

అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రకాల సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సీఐఐ సదస్సులో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. సదస్సు తొలి రోజు లోనే సుమారు రూ. 32 వేల కోట్ల పెట్టుబడులను CRDA ఆకర్షించింది. మొత్తం ఎనిమిది సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో అమరావతి ప్రాంత వాసులు, CRDA వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News November 15, 2025
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్లకు ‘ఇటుక’ గుదిబండ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇటుక ధరలు పెనుభారంగా మారాయి. ఇటుక బట్టీల తయారీదారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచారు. 2500 ఇటుకల ధర గతంలో రూ.10,000 కాగా ప్రస్తుతం రూ.18,000 వరకు పెంచారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడిపై అదనంగా లక్ష రూపాయల వరకు భారం పడుతోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, రాయితీపై ఇటుకలు సరఫరా చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
News November 15, 2025
దివ్యాంగుల రిజర్వుడ్ పోస్టుల భర్తీ గడువు పొడిగింపు

AP: అన్ని ప్రభుత్వ విభాగాల్లోని దివ్యాంగుల రిజర్వుడ్ ఖాళీలను ప్రత్యేక రిక్రూట్‌మెంటు ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయించిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ బ్యాక్‌లాగ్ కేటగిరీ పోస్టులను 2026 మార్చి 31లోగా భర్తీ చేయాలని సూచించింది. ఈమేరకు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో 2024 మార్చి 31లోగా పోస్టుల భర్తీకి గడువు నిర్దేశించగా తాజాగా దాన్ని పొడిగించింది.
News November 15, 2025
జిన్నింగ్ మిల్లులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

జిన్నింగ్ మిల్లులు 17 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తామని ప్రకటించడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తమయ్యారు. మిల్లుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 7 క్వింటాళ్ల పరిమితితో రైతులకు కలిగే ఇబ్బందులను సీసీఐ ఎండీకి తెలియజేయాలన్నారు. కొనుగోళ్లు కొనసాగించాలని మిల్లులను కోరారు. దిగుబడి పరిమితిని 11 క్వింటాళ్లకు పెంచాలని కేంద్రాన్ని తుమ్మల కోరారు.


