News August 5, 2024
అమరావతిలో భూమి సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం

రాజధాని పరిధిలో ప్రతి సెంటు భూమి సమీకరణ లేదా సేకరణ విధానంలో తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామాలు, గ్రామకంఠాల కిందనున్న భూమి తప్ప మిగిలినదంతా తీసుకోనుంది. దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని CRDA వర్గాలు స్పష్టంచేశాయి. భవనాలను CRDA స్వాధీనం చేసుకునే అవకాశముంది. భూములపై కోర్టు స్టేలు ఉంటే వాటిని వెకేట్ చేయించి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఇంకా 4,181 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది.
Similar News
News February 20, 2026
అమరావతికి సిద్ధం కానున్న అసలైన మణిహారం

అమరావతికి అసలైన మణిహారం సిద్ధమవుతోంది. రూ.40,847 కోట్ల భారీ వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. మొత్తం 96.2 కిలోమీటర్ల పొడవుతో, 75 మీటర్ల భారీ వెడల్పుతో ఈ రహదారిని డిజైన్ చేశారు. ఇది 8+4 వరుసల (Lanes) కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. అంటే ప్రధాన ప్రయాణం కోసం 8 వరుసల రహదారి ఉంటే, స్థానిక రవాణా కోసం అధనంగా మరో 4 వరుసల సర్వీస్ రోడ్లు ఉంటాయి.
News February 20, 2026
తెనాలిలో పర్యటించిన YS షర్మిల

PCC అధ్యక్షురాలు YS షర్మిల శుక్రవారం తెనాలిలో పర్యటించారు. ఆమె పాదయాత్రలో భాగంగా ఉదయం తెనాలి చేరుకున్న షర్మిలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా BJP ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
News February 20, 2026
గుంటూరు: ‘స్త్రీ శక్తి’తో 1.70 లక్షల టికెట్లు

మహా శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా భక్తుల ప్రయాణం భారీగా పెరిగింది. స్త్రీశక్తి ఉచిత ప్రయాణ పథకం ద్వారా
మహిళలు శ్రీశైలం, అమరావతి, కోటప్పకొండ, గోవాడ వంటి శైవక్షేత్రాలకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని 5 డిపోల నుంచి అదనపు సర్వీసులు నడిపించారు. 2 రోజుల్లో 1.70 లక్షల మందికి పైగా మహిళలకు జీరో టిక్కెట్లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగిందన్నారు.


