News September 28, 2025
అమరావతిలో మంత్రి ఇంటి నిర్మాణానికి సన్నాహాలు

వెలగపూడి రెవెన్యూ పరిధిలో మంత్రి నారాయణ కొత్త ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నివాసానికి రెండు ప్లాట్ల దూరంలో 4,500 గజాల స్థలాన్ని స్థానిక రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసి, ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్, మట్టి పనులు పూర్తి చేశారు. విజయదశమి శుభదినాన్ని పురస్కరించుకుని అక్టోబరు 2న భూమి పూజ జరిపే అవకాశం ఉన్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News September 28, 2025
విజయవాడ: అమ్మవారి గుడి వైపు బైక్‌లకు నో ఎంట్రీ

సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా 29వ తేదీ రాత్రి 7.30 నుంచి 30న ఉదయం 10 వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. కుమ్మరిపాలెం, తాడేపల్లి చెక్‌పోస్ట్, గద్ద బొమ్మ సెంటర్ నుంచి బైక్‌లు, వాహనాలు అమ్మవారి గుడివైపు అనుమతించమన్నారు. నగరంలోకి ప్రవేశించే వాహనాలు పోలీసుల సూచనల మేరకు వారధి, వెస్ట్ బైపాస్, కనకదుర్గ ఫ్లైఓవర్, చిట్టినగర్ సొరంగం, BRTS రోడ్డు, CVR ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలన్నారు
News September 28, 2025
గుంటూరు: వరదల పరిస్థితిపై కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

వరదల పరిస్థితిపై సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం, అన్నవరంపాలెం లంక గ్రామాల కృష్ణా నది వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలు పాటించాలని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08963 2234014 ఫోన్ నంబరుకు సమాచారం అందించవచ్చని ఆమె చెప్పారు.
News September 28, 2025
GNT: అమ్మవారి గుడి వైపు బైక్‌లకు నో ఎంట్రీ

సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా 29వ తేదీ రాత్రి 7.30 నుంచి 30న ఉదయం 10 వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. కుమ్మరిపాలెం, తాడేపల్లి చెక్‌పోస్ట్, గద్ద బొమ్మ సెంటర్ నుంచి బైక్‌లు, వాహనాలు అమ్మవారి గుడివైపు అనుమతించమన్నారు. నగరంలోకి ప్రవేశించే వాహనాలు పోలీసుల సూచనల మేరకు వారధి, వెస్ట్ బైపాస్, కనకదుర్గ ఫ్లైఓవర్, చిట్టినగర్ సొరంగం, BRTS రోడ్డు, CVR ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలన్నారు.