News October 3, 2025

అమరావతిలో మంత్రి నారాయణ ఇంటికి శంకుస్థాపన

image

రాజధాని ప్రాంతమైన అమరావతిలో మంత్రి నారాయణ సొంత ఇంటికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. వెలగపూడి రెవెన్యూలోని 4600 గజాల స్థలంలో, సీఎం చంద్రబాబు ఇంటికి దక్షిణం వైపు కేవలం 100 మీటర్ల దూరంలో మంత్రి సొంతింటి నిర్మాణం చేపట్టనున్నారు. కాగా ఐదు రోజుల విదేశీ పర్యటన అనంతరం మంత్రి నారాయణ అమరావతికి చేరుకొని శంకుస్థాపన చేశారు.

Similar News

News October 3, 2025

సీఎం చేతుల మీదుగా ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం

image

సీఎం చంద్రబాబు శనివారం ‘ఆటో డ్రైవర్ సేవలో’ అనే నూతన పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉదయం 9:30 గంటలకు ఆయన స్వయంగా ఆటో ఎక్కి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు మంత్రులు హాజరవుతారని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 3, 2025

చినరావూరులో తీవ్ర విషాదం

image

నల్గొండ (D) దేవరపల్లి దిండి కాలువలో గురువారం ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెనాలి చినరావూరుకు చెందిన కేతావత్ రాము నాయక్ (34) కూడా ఉండటంతో స్థానికంగా విషాదం నెలకొంది. దసరా పండుగకు బంధువులతో కలిసి అక్కడకు వెళ్లిన రాము కాలువలో పడిన మేనల్లుడు సాయి ఉమాకాంత్ ను రక్షించే క్రమంలో మృతి చెందాడు. సాయంత్రానికి రాము మృతదేహం తెనాలి రానుంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News October 3, 2025

భవిష్యత్ అవసరాలు ముందే గుర్తించాలి: కలెక్టర్

image

వ్యవసాయం, వాటి అనుబంధ రంగాల్లో పెట్టుబడి తగ్గి రైతులకు లాభం పెరగాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రాథమిక రంగాల శాఖలతో శుక్రవారం కలెక్టర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణలు దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రాథమిక రంగాల్లో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలని, ఏ అంశాన్ని సాధారణంగా తీసుకోరాదని, భవిష్యత్తులో అవసరాలను ముందుగా గుర్తించాలన్నారు.