News February 19, 2026

అమరావతిలో మిగిలిన భూముల సేకరణ

image

అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములను భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా 2,459 ఎకరాల భూమి పూలింగ్‌కు రాలేదు. అయతే భూసేకరణ నోటిఫికేషన్ విడుదలకు ముందే రైతులు ముందుకొస్తే, వారికి ల్యాండ్ పూలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 20, 2026

పిల్లలకు మేకప్ వేస్తున్నారా?

image

ప్రస్తుత రోజుల్లో పిల్లలకీ మేకప్‌ వేయడం సాధారణం అయిపోయింది. స్కూలు ప్రోగ్రాములున్నాయనో, వారు మారాం చేస్తున్నారనో మేకప్ వేస్తున్నారు. కానీ వీటివల్ల తలనొప్పి, త్వరగా నెలసరి రావడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తప్పనిసరి అయితే మైల్డ్​వీ, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లిప్ స్టిక్, మస్కారా వంటివి అస్సలు వాడకూడదని చెబుతున్నారు.

News February 20, 2026

కామారెడ్డి నుంచి జుక్కల్‌కు బస్సులు

image

కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి జుక్కల్‌కు బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ దినేశ్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు ట్రిప్పులు ఈ బస్సు రాకపోకలు సాగిస్తుందని, ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News February 20, 2026

కృష్ణా: తిరుపతికి వెళ్లేవారికి గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా విశాఖపట్నం(VSKP)- తిరుపతి(TPTY) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబరు 08583 VSKP- TPTY రైలు మార్చి 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం, నంబరు 08584 TPTY- VSKP మధ్య నడిచే రైలు మార్చి 3 నుంచి 31 వరకు ప్రతి మంగళవారం పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని తెలిపారు.