News February 13, 2026
అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పనులు వేగవంతం

అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు 24 గంటలూ పనులు చేస్తున్నారు. సుందరీకరణ పనులకు మరికొంత సమయం పడుతుందని, ప్రస్తుతానికి విగ్రహావిష్కరణ మాత్రమే మార్చి 16న జరుగుతుందని సమాచారం. మిగిలిన పనులు తర్వాత పూర్తి కానున్నాయి.
Similar News
News February 18, 2026
ఈ నెల 26న కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26న కొడంగల్‌కు రానున్నట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ పున:నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఇటీవలే నిధులు మంజూరు చేసింది. ఆలయ నిర్మాణ పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నట్లు తెలిసింది.
News February 18, 2026
వెంటిలేటర్‌పై సల్మాన్ ఖాన్ తండ్రి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.
News February 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

టెక్కలి: రోజులు గడిచాయి..వసతుల్లో మార్పు రాదా?
తాలభద్ర రైల్వే వంతెన పనులు ప్రారంభిస్తాం: రామ్మోహన్
జలుమూరు: చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా డీ-వార్మింగ్ డే కార్యక్రమం
ఎల్.ఎన్ పేట: ఎరువుల కోసం రైతుల పాట్లు
జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు
కవిటి: ఈనెల 26న ఎల్లమ్మ జాతర.


