News August 5, 2025

అమరావతి అనుసంధాన మార్గాల అభివృద్ధే లక్ష్యం: మాధవ్

image

రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేపట్టాయని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఫసల్ భీమా అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రతీ గ్రామానికి బీజేపీ జెండా, కూటమి అజెండాను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు రాష్ట్రానికి వరాలు ఇస్తున్నారు. అమరావతి అనుసంధాన మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు.

Similar News

News September 9, 2025

అమరావతికి మరో ప్రముఖ సంస్థ

image

అమరావతికి మరో ప్రముఖ సంస్థ వస్తుంది. రూ.200 కోట్లతో అమరావతిలో 4 ఎకరాల్లో వివాంత (తాజ్ గ్రూప్) 5-స్టార్ హోటల్ నిర్మాణం కానుంది. మందడం సమీపంలో సీడ్ ఆక్సిస్ రోడ్డు పక్కన CRDA స్థలం కేటాయించగా ప్రస్తుతం చదును చేస్తున్నారు. 2028 నాటికి ఈ 5-స్టార్ హోటల్ ప్రారంభం అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఆతిథ్యం, పెట్టుబడి రంగానికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అని పలువురు అంటున్నారు

News September 9, 2025

GNT: అమ్మకు కష్టం వస్తే.. ఆశ్రయం కల్పించారు

image

తక్కెళ్లపాడు రోడ్డులో సోమవారం ఓ వృద్దురాలు దీనస్థితిలో పడి ఉండటం స్థానికులను కలిచివేసింది. గుర్తుతెలియని వ్యక్తులు వృద్దురాలిని వదిలి పెట్టి వెళ్లడంతో స్థానికులు పాతగుంటూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ టీమ్ ఆ వృద్దురాలికి సపర్యలు చేసి పొన్నూరు గోతాలస్వామి ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.

News September 8, 2025

Way2News ఎఫెక్ట్.. దుర్గగుడికి వైద్యుల కేటాయింపు

image

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో వైద్యులు లేకపోవడంపై Way2Newsలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై DMHO సుహాసిని స్పందించారు. సోమవారం ఇద్దరు వైద్యులను దుర్గగుడికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట ఏరియాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేశ్ బాబు, కృష్ణలంకలో పనిచేస్తున్న డాక్టర్ ఉదయ్ కృష్ణలను డిప్యూటేషన్‌పై దుర్గగుడిలో పనిచేయాలని ఆదేశాలు అందాయి. దీంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.