News January 9, 2026
అమరావతి ఆవకాయ ఉత్సవాల్లో కలెక్టర్

విజయవాడ భవానీ ద్వీపంలో నిర్వహించిన ఆవకాయ్ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవంలో కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. రెండో రోజు చేపట్టిన కార్యక్రమాలు నగరవాసులు, పర్యాటకుల నుంచి విశేష స్పందనను పొందాయి. మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నగాడా వాయిద్యాలు ప్రాంతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించగా, సంప్రదాయ కళల పరిరక్షణలో ఇలాంటి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News February 15, 2026
కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్ఠ భద్రతా చర్యలు

కోటప్పకొండ తిరునాళ్ల బందోబస్తుపై పోలీస్ శాఖ ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన సమావేశంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ కృష్ణారావు పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్సవాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
News February 15, 2026
గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ దాకా NH-167 విస్తరణ: మోదీ

TG: హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు NH-167ను 4 వరుసలుగా విస్తరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై PM మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘NH-167 విస్తరణ నిర్ణయం ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఉపాధి అవకాశాలు సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని పేర్కొన్నారు. 80KM పొడవైన ఈ ప్రాజెక్టుకు ₹3,175 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
News February 15, 2026
బందరు పోర్ట్, బుడమేరుకు మొండిచేయి..!

బందరు పోర్టు పనులకు గత ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించగా, పోర్టు పనులు 50 శాతం పూరైనా ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. బుడమేరు ప్రక్షాళనకు నిధులు వస్తాయని కూటమి నేతలు ఆశా భావం వ్యక్తం చేసినా చివరికి మొండిచేయే మిగిలింది. ఇక విజయవాడ, వైజాగ్ మెట్రో పనులకు కలిపి రూ. 15.50 కోట్లు కేటాయించారు. ఐతే ఇప్పటివరకు కేంద్రం నుంచి మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు రాలేదు.


