News March 4, 2025
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో పల్నాడుకు మహర్దశ

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పల్నాడు జిల్లాకు మహర్దశ పట్టనుంది. రింగ్ రోడ్డు పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు, పెదకూరపాడు మండలంలోని మూసాపురం, పాటిబండ్ల, జలాలపురం, కంభంపాడు, తాళ్లూరు, లింగం గుంట్ల, కాశిపాడు గ్రామాల మీదగా వెళ్తుంది. జిల్లాల విభజనలో నాగార్జునసాగర్, పులిచింతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News September 19, 2025
పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 పోస్టులకు ప్రకటన వెలువడింది. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 12. పూర్తి వివరాల కోసం <
News September 19, 2025
దసరా సెలవుల వేళ.. HYD విద్యార్థులకు గుడ్‌న్యూస్

దసరా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఆనందమే.. ఆనందం.. సిటీలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు సొంతూరికి వెళతారు. ఈ క్రమంలో వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వీటిని ఏర్పాటు చేశామన్నారు. బస్సుల వివరాల కోసం 9959226148, /6142, / 6136/ 6129 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
News September 19, 2025
అన్నమయ్య కలెక్టర్‌ని కలిసిన ఎస్పీ

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిశాంత్ కుమార్‌ను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధి, చట్ట వ్యవస్థ బలోపేతం, ప్రజాసేవలో పరస్పర సహకారంపై చర్చ, పోలీస్-రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం, ఆత్మీయత తదితర వాటిపై చర్చించారు. ప్రజల శ్రేయస్సు కోసం కలిసి కృషి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.