News September 17, 2025
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మోడల్స్ ప్రదర్శన

విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు జరిగే 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) యొక్క సూక్ష్మ నమూనాలను APCRDA ప్రదర్శించనుంది. ప్రజలు భవిష్యత్తులో నిర్మించబోయే ఈ కాంప్లెక్స్‌ను ప్రత్యక్షంగా చూసి అనుభూతి పొందేందుకు వీలుగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది.
Similar News
News September 17, 2025
తిరుమలకు బైకుల నిలిపివేత

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 28న జరిగే గరుడసేవకు టీటీడీ పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 27న రాత్రి 9 గంటల నుంచి 29న సాయంత్రం 6 గంటల వరకు టూవీలర్స్‌ను కొండపైకి అనుమతించరు. రెండు ఘాట్ రోడ్డులో బైకుల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. అలిపిరి వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించింది. అలాగే ఈనెల 28న గరుడ సేవ రోజున రెండు నడక మార్గాలు 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు.
News September 17, 2025
పంట నమోదుకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం

పంట నమోదుకు ఈనెల 30వ తేదీ చివరి గడువు అని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించి, రైతులను పంట వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. 2025-26 సంవత్సరం PM కిషన్ అన్నదాత సుఖీభవ పథకంలో రెండో విడత అక్టోబర్‌లో విడుదల చేస్తామని చెప్పారు. అకౌంట్ నంబర్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని సూచించారు.
News September 17, 2025
బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్ ఎంత నష్టపోయేది?

ఆసియా కప్‌లో భాగంగా UAEతో మ్యాచ్‌ను ఒకవేళ పాకిస్థాన్ బాయ్‌కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు ₹145కోట్ల ఆదాయం కోల్పోయేది. ఇక మ్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా బాయ్‌కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు రూ.140కోట్లు ICCకి చెల్లించాల్సి ఉండేదని విశ్లేషకులు అంచనా వేశారు. అంటే మొత్తంగా రూ.285కోట్ల భారం మోయాల్సి వచ్చేదన్నమాట.