News December 30, 2024
అమరావతి: పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్‌రాజు

అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించారు. సినిమా టికెట్ రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లపై చర్చించారు. కాగా కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. పవన్ హాజరవుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 10, 2025
గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్‌కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 9, 2025
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.