News December 23, 2025

అమరావతి బ్రాండ్‌కు ఊపిరి.. ‘ఆవకాయ’ సాంస్కృతిక ఉత్సవం

image

అమరావతి బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో AP ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా పర్యాటక శాఖ సరికొత్త సాంస్కృతిక ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ఆవకాయ’ అనే వినూత్న పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా వేడుకలు నిర్వహించనుంది.

Similar News

News December 23, 2025

నేడు తుళ్లూరులో రైతు JAC సమావేశం

image

తుళ్లూరులోని బీజేపీ రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి మేరకు రైతు JAC సభ్యులు మంగళవారం సమావేశం కానున్నారు. భారత మాజీ ప్రధాని వాజపేయి శత జయంతి సందర్భంగా ఆయన కాంశ్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ ఈ నెల 25న చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డి, తదితరులు పాల్గొని కార్యక్రమంపై చర్చించనున్నారు.

News December 23, 2025

GNT: పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన రద్దు

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన అనూహ్యంగా రద్దైంది. నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఆయన పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయినట్లు స్థానిక జనసేన నేతలు వెల్లడించారు. గతంలో ఇక్కడ పర్యటించినప్పుడు ఇండ్ల నాగేశ్వరమ్మ అనే మహిళకు మళ్లీ వస్తానని పవన్ మాటిచ్చారు. ఆయన రాక కోసం ఎదురుచూసిన గ్రామస్థులు, పర్యటన రద్దవడంతో నిరాశ చెందారు.

News December 23, 2025

GNT: డీజీపీ కమెండేషన్ డిస్క్‌లకు ఎంపికైన పోలీస్ అధికారులు

image

ఏపీ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన పోలీస్ అధికారులకు 2025 సంవత్సరానికి గాను డీజీపీ కమెండేషన్ డిస్క్‌లను ప్రకటించారు. ఈ అవార్డులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ విభాగాల్లో అందజేస్తారు. సిల్వర్ డిస్క్ విభాగంలో ASP(అడ్మిన్) జి. వెంకట రమణ మూర్తి, తాడికొండ సీఐ కె. వాసు, చేబ్రోలు పోలీస్ ఏఎస్సై–(2260) యు. శ్రీనివాసరావు ఎంపికయ్యారు. అటు బ్రాంజ్ మెడల్ విభాగంలో మరో 20 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు.