News January 2, 2026
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ షురూ

AP: అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్‌కు రేపు నోటిఫికేషన్ జారీకానుంది. పెదపరిమి, వడ్లమాను, వెకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లెల్లోని పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలు సమీకరిస్తారు. మరో 3828.56 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకోనున్నారు. FEB 28లోపు ప్రక్రియ పూర్తిచేస్తారు. కాగా 4 ఏళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, లేకుంటే ₹5L పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News February 16, 2026
TGలో మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ల ఎన్నిక UPDATES

* నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య(INC), వైస్ ఛైర్మన్‌గా అప్పాల గణేశ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ భార్యాభర్తలు.
* జగిత్యాల(D) మెట్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా లింబాద్రి(INC) ఎన్నికయ్యారు. 26 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 6 సీట్లే గెలుచుకుంది. అయితే పలువురు ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ సభ్యుడి మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
News February 16, 2026
ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు కోపం, భయం, బాధ వస్తే లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్ట్ విశేష్. కాబట్టి ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని సూచిస్తున్నారు. కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.
News February 16, 2026
విజయ్- రష్మిక పెళ్లికార్డు వైరల్!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక వివాహం ఈనెల 26న జరగనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఒకటి వైరలవుతోంది. మార్చి 4న 7PMకి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగనుందని అందులో పేర్కొన్నారు. పెళ్లిని బంధువుల సమక్షంలో చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై VD టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


