News January 24, 2026

అమరావతి రెండో దశ విస్తరణకు టెండర్లు

image

అమరావతి నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం CRDA అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో పాల్గొనడానికి ఫిబ్రవరి 6వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా, రైతులకు ప్లాట్ల కేటాయింపు మొదలైంది. రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పగించేందుకు ఈ టెండర్లు పిలిచారు.

Similar News

News February 21, 2026

చిత్తూరు: ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయండి!

image

చిత్తూరులో జరిగే గ్రీవెన్స్ డే కోసం ఎంతోమంది కష్టపడి వస్తుంటారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. http//:pgrs.ap.gov.in వెబ్ సైట్‌లో మీ సమస్యను నమోదు చేసి రసీదు పొందవచ్చు. అలాగే 1100కి ఫోన్ చేసి సమస్య చెప్పినా నమోదు చేసుకుంటున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.

News February 21, 2026

కెరీర్ గైడెన్స్.. కాల్ చేసి సరైన మార్గాన్ని ఎంచుకోండి!

image

టెన్త్, ఇంటర్ తర్వాత ఏం చేయాలనే సందేహంలో మీ పిల్లలున్నారా? అలాంటి వారికి సరైన మార్గాన్ని సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. విద్యార్థులు భవిష్యత్తులో సరైన కోర్సులను ఎంచుకునేందుకు 1800 425 2428 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు. ఆదివారం మినహా ప్రతిరోజూ 9AM నుంచి 6PM వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. SHARE IT

News February 21, 2026

గౌతమ్.. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను: జగన్

image

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేడు. ఈనేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న బంధాన్ని మాజీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘డియర్ గౌతమ్.. మన స్నేహంతో కూడిన మధురమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు నాకు స్నేహితుడే కాదు సోదరుడివి. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతావు’ అంటూ జగన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.