News November 1, 2025

అమరావతి రైల్వే లైన్‌ నిర్మాణానికి భూసేకరణ.. ఎక్కడెక్కడంటే.!

image

అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కోసం ఎర్రుపాలెం-నంబూరు మధ్య 56 కి.మీ మేర భూసేకరణ పూర్తవుతోంది. నందిగామ, జగ్గయ్యపేట, VJA మీదుగా వెళ్లే ఈ మార్గానికి ఇప్పటికే 260 ఎకరాల వరకు ల్యాండ్ అక్విజైషన్‌ పూర్తయింది. ఇందులో నందిగామ, జగ్గయ్యపేటలలోనే సుమారు 250 ఎకరాలు ఉన్నాయి. అమరావతిలో 8 ప్లాట్‌ఫామ్‌లతో కోచింగ్ టెర్మినల్, VJA రద్దీని తగ్గించేందుకు గన్నవరం స్టేషన్‌లో టెర్మినల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

Similar News

News November 1, 2025

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి బీఆర్‌ఎస్‌ పిలుపు

image

భద్రాద్రి జిల్లాలో రోడ్ల దయనీయ స్థితి, డిఎంఎఫ్‌టి నిధుల దుర్వినియోగంపై నిరసనగా నవంబర్ 7న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేపట్టి ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు.

News November 1, 2025

జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఇప్పటి వరకు 15 కేసులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిబంధనలను అధికారులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్, BRS, BJP నాయకులు తమ ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలపై నిఘా వేసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు పేర్కొన్నారు.