News April 6, 2025
అమరావతి: వేగంగా గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు

ఏపీ మెడ్‌టెక్‌జోన్ ప్రాంగణంలో గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇది మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణంగా నిలుస్తోంది. పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది రాష్ట్రానికి, దేశానికి సాంకేతిక వైద్య పరికరాల రంగంలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News April 7, 2025
లావేరు: ‘బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలి’

లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మీసాల భానోజీ రావు సోమవారం జరిగిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో బెట్టింగ్ యాప్‌లపై ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌ల మాఫియాపై నిఘా ఉంచాలని, వాటిని అరికట్టకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
News April 7, 2025
Xలోకి రీఎంట్రీ ఇచ్చిన సమంత

స్టార్ హీరోయిన్ సమంత ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లోనే యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఎక్స్‌లో కూడా యాక్టివ్‌గా మారేందుకు సిద్ధమయ్యారు. తాను నిర్మించిన ‘శుభం’ సినిమా విశేషాలను తెలుపుతూ పోస్ట్ చేశారు. కాగా సామ్‌కు ఇప్పటికే ఎక్స్‌లో 10.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
News April 7, 2025
భారత్ సహా 14 దేశాల వీసాలపై సౌదీ నిషేధం

హజ్ 2025 యాత్రకు ముందు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాలకు వీసాల జారీని సౌదీ అరేబియా నిలిపివేసింది. జూన్ వరకు ఉమ్రా, వ్యాపార, కుటుంబ వీసాలపై ఈ నిషేధం అమల్లో ఉండనుంది. హజ్ వీసాలపై మాత్రం ఆంక్షలు లేవు. వీసా వ్యవస్థలో గందరగోళం, అక్రమ హజ్ యాత్రలు, కుటుంబ వీసాలపై సౌదీలోకి ప్రవేశించి రూల్స్‌కు విరుద్ధంగా వలస, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ఘటనలతో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది.