News December 3, 2025

అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

image

అమరావతి సచివాలయంలో ఇనుప బారికేడ్లను తొలగించారు. బారికేడ్ల వల్ల ప్రజలు, సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన సీఎం చంద్రబాబు.. వెంటనే వాటిని తొలగించాలని పోలీసులను ఆదేశించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, ఆ స్థానంలో అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు.

Similar News

News February 10, 2026

డిజిటల్ లావాదేవీల పై అప్రమత్తత అవసరం: కలెక్టర్

image

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన పొందాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. RBI ఫిబ్రవరి 9 నుంచి 13వ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.

News February 10, 2026

అమరావతి అనుసంధానంగా నాలుగు వరుసల ROB

image

రాజధాని అమరావతి అనుసంధానంగా మంగళగిరి పట్టణంలో నిడమర్రు రైల్వే గేట్ వద్ద నాలుగు వరుసల రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.90.58 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును18 నెలల్లో పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రద్దీ తగ్గించి, అమరావతి ప్రాంతానికి వేగవంతమైన రాకపోకలకు ఇది దోహదం చేయనుంది.

News February 10, 2026

GNT: మందగించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే

image

ప్రభుత్వ పథకాల లక్ష్యంతో చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మందగించింది. గుంటూరులో 52.2%, బాపట్లలో 53.4%, పల్నాడులో 36.9 శాతం నమోదు పూర్తైంది. ప్రశ్నావళిలో అడిగే వివరాలకు ప్రజలు సమాధానాలు ఇవ్వడంలో వెనకడుగు వేస్తున్నారు. ఆధారాలు చూపేందుకు నిరాకరిస్తున్నారు. సిబ్బంది ఇళ్లకు వెళ్లినా చాలామంది నివాసం లేనివారిగా తేలుతున్నారు. దీంతో లక్షల్లో పౌరుల చిరునామాలు లభించని పరిస్థితి.