News September 12, 2025

అమరావతి ORR అప్డేట్

image

అమరావతి ORR అప్డేట్ వచ్చింది. 140 మీటర్ల వెడల్పుతో సవరించిన DPR ప్రతిపాదనలను రూ.25 వేల కోట్ల అంచనాతో MoRTH సాంకేతిక కమిటీకి పంపారు. ఐతే ఆమోదం పొందిన తర్వాత ఫైల్ PPP అంచనా కమిటీకి, చివరకు ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు తరలించబడింది. అమరావతి ORR పై రావడంతో ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని పెరిగింది.

Similar News

News March 31, 2026

మలయాళ డైరెక్టర్‌తో ఐకాన్ స్టార్ 25వ చిత్రం?

image

అల్లు అర్జున్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ‘AA22’ తెరకెక్కుతుండగా, ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక 25వ చిత్రానికి మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. దీన్ని ‘గీతా ఆర్ట్స్’ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనుందని తెలుస్తోంది. కేరళలో ఐకాన్ స్టార్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

News March 31, 2026

VJA: ‘ఉగ్ర’లింకుల కేసు.. కస్టడీకి నిందితులు

image

‘ఉగ్ర’ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం పేర్కొంది. కస్టడీకి అనుమతివ్వాలని కొత్తపేట పోలీసులు సోమవారం కోర్టును కోరిన విషయ తెలిసిందే. దీంతో రేపటి నుంచి నిందితులు షరీఫ్, సొహైల్, దానిష్, అబ్దుల్, సైదా బేగంను 5 రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు.

News March 31, 2026

రేపటి నుంచి NTR వైద్యసేవలు బంద్!

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)లను నిలిపివేయనున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. రూ.3వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాయి.