News March 18, 2026

అమలాపురంలో జిల్లా స్థాయి పోటీలు.. పాల్గొనేందుకు రెడీనా?

image

అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో మార్చి 24వ తేదీ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మాస్టర్స్ ఎంపి కలు నిర్వహిస్తున్నట్లు క్రీడాధికారి వీఆర్ రుద్ర తెలిపారు. 35, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు 100, 400, 800 మీటర్ల రన్నింగ్ పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

Similar News

News April 5, 2026

సింగిపురం: 113కి చేరిన కల్తీ బాదంపాల బాధితుల సంఖ్య

image

శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం జాతరలో కల్తీ బాధంపాలు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో శుక్రవారం సుమారు 80 మంది పీహెచ్సీలో చేరగా.. శనివారంనాటికి కేసులు 113కు పెరిగాయి. ప్రస్తుతం బాధితులకు స్థానిక పీహెచ్సీలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.

News April 5, 2026

KMR: జిల్లాలో చికెన్, మటన్ ధరలు

image

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ.280-రూ.290 విక్రయిస్తుండగా లైవ్ కోడి రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. మటన్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

News April 5, 2026

IPL: ఇప్పటి వరకు వీళ్లే టాప్!

image

IPL-19లో ఇప్పటి వరకు 9మ్యాచులు జరగ్గా పలువురు యంగ్ క్రికెటర్లు సత్తా చాటారు. DC ప్లేయర్ సమీర్ రిజ్వీ ఆడిన 2 మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో 160పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత లిస్టులో రోహిత్(113), కూపర్(108), రఘువంశీ(103) ఉన్నారు. ఇక రవి బిష్ణోయ్(RR) 5 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ దక్కించుకున్నారు. వైశాఖ్ విజయ్ కుమార్ సైతం 5 వికెట్లు పడగొట్టినా ఎకానమీ పరంగా 2వ స్థానంలో ఉన్నారు.