News March 16, 2025

అమలాపురంలో రేపటి నుంచి ఇంటర్ వాల్యుయేషన్

image

కోనసీమ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి సోమవారం నుంచి వాల్యుయేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు ఇంటర్మీడియట్ జిల్లా విద్యా అధికారి సోమశేఖరరావు తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించిన వాల్యుయేషన్ అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతుందన్నారు. ఇప్పటికే ఏడో తేదీ నుంచి సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందన్నారు.

Similar News

News September 17, 2025

నిర్మల్: ‘రైతులు అధైర్య పడొద్దు.. ఆదుకుంటా’

image

రైతులు ఎవరూ అధైర్య పడొద్దని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో భారీ వర్షాలకు తెగిపోయిన పెద్ద చెరువు కట్టను బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News September 17, 2025

ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి: మంత్రి

image

TG: ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి రాజనర్సింహ కోరారు. గత 9 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడెందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. బకాయిలను చెల్లించాలనే డిమాండ్‌తో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇవాళ్టి నుంచి సేవలను <<17734028>>నిలిపివేసిన<<>> సంగతి తెలిసిందే.

News September 17, 2025

ఎన్టీఆర్: అమరావతి అసైన్డ్ రైతులకు ఊరట

image

రాజధాని అమరావతికి భూములిచ్చిన అసైన్డ్ రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. CRDA వీరికిచ్చే రిటర్నబుల్ ఫ్లాట్ల ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లో “అసైన్డ్” అనే పదం తొలగించి పట్టా భూమి అనే పేర్కొంటామని బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఇటీవల చంద్రబాబును కలసిన రైతులు అసైన్డ్ అని ఉన్న కారణంగా తమ ఫ్లాట్లకు తక్కువ ధర వస్తోందని చెప్పగా..సీఎం చంద్రబాబు ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.