News July 4, 2025

అమలాపురం: అల్లూరికి నివాళులర్పించిన ఎస్పీ

image

అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సీతారామరాజు చిత్రపటానికి ఎస్పీ కృష్ణారావు పూలమాలవేసి నివాళులర్పించారు. అదనపు ఎస్పీ ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News July 4, 2025

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

* నరసన్నపేట: టైర్ పేలి విద్యార్థుల ఆటో బోల్తా
* జిల్లాలో అల్లూరి జయంతి
* శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట, పొందూరు, రణస్థలంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు
* ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి
* హిరమండలం: నిండు కుండల వంశధార నది
* అక్రమ సంబంధం రెండు హత్యలకు దారితీసింది: డీఎస్పీ
* టెక్కలి: విద్యుత్ మీటర్ల సమస్యతో తల్లికి వందనం ఇబ్బందులు
* సారవకోట: అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నోటీసు

News July 4, 2025

వనపర్తి: పోలీస్ డ్యూటీమీట్‌లో పతకాలు సాధించిన వారికి అభినందన

image

జోగులాంబ జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీమీట్‌లో వనపర్తి జిల్లాకు బంగారు 4, రజత 4, కాంస్య 5 మొత్తం 13 పతకాలు సాధించారు. వీరిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ అభినందించారు. నాగర్ కర్నూల్‌లో 2 రోజులపాటు నిర్వహించిన జోగులాంబ జోన్-7 జోనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో ఈ పతకాలు సాధించినట్లు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రస్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలన్నారు.

News July 4, 2025

మెగా DSC.. రేపు ‘కీ’లు విడుదల

image

AP: మెగా DSCలో జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’లను రేపు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. <>https://apdsc.apcfss.in<<>>లో కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయి. ‘కీ’పై అభ్యంతరాలను సంబంధిత ఆధారాలతో ఈనెల 12వ తేదీలోగా DSC వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని అధికారులు పేర్కొన్నారు. జూన్ 6 నుంచి 28 వరకు జరిగిన పరీక్షల ‘కీ’, రెస్పాన్స్ షీట్లను ఇప్పటికే విడుదల చేశారు.