News February 12, 2026
అమలాపురం: ఆన్‌లైన్ మోసం.. ఆర్ఎంపీ వైద్యుడి ఖాతా ఖాళీ!

అమలాపురానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఫేక్ ‘నాప్తాల్’ సైట్‌లో రూ. 2,000 పెట్టి ఫోన్ కొని సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఫోన్ పనిచేయకపోవడంతో వారిని సంప్రదించగా, రీఫండ్ ఇస్తామని నమ్మించి బ్యాంక్ వివరాలు, రెండుసార్లు ఓటీపీలు తీసుకున్నారు. దీంతో బాధితుడి ఖాతా నుంచి రూ. 99,000 మాయం చేశారు. బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News February 15, 2026
‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్లే..

దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జన నాయగన్’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు మరో షాకింగ్ న్యూస్. సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న ఈ మూవీ ఇప్పుడు ఏప్రిల్ వరకు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. కెనడా డిస్ట్రిబ్యూటర్ ‘యార్క్ సినిమాస్’ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2026 ఏప్రిల్ 30కి ముందు ఈ చిత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తేల్చి చెప్పింది.
News February 15, 2026
ప్రేమ విఫలం.. ఆళ్లగడ్డలో యువకుడి సూసైడ్?

ఆళ్లగడ్డలోని పుల్లారెడ్డి వీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ జీవిస్తున్న రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయను సయామి(25) ఇంట్లో ఉరివేసుకొని అనుమానాదాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలమై ఉరివేసుకొన్నట్లు భావిస్తున్నారు.