News September 14, 2025

అమలాపురం ఎంపీకి 4వ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో అమలాపురం ఎంపీ గంటి హరీశ్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 77 ప్రశ్నలు అడగటంతో పాటు 13 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 98.35గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.

Similar News

News September 14, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో 81మిమీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5మిమీ వర్షపాతం నమోదైందని చెప్పారు. పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిమీ, పెదకూరపాడులో 40.2 మిమీ, చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని వెల్లడించారు.

News September 14, 2025

మక్కువ: మేడ పైనుంచి కింద పడి వ్యక్తి మృతి

image

మక్కువ మండలం పాలకవలసకు చెందిన పాల గౌరు విద్యుత్ తీగలు తగిలి మేడ పైనుంచి కిందపడి ఆదివారం మృతి చెందాడు. బీసీ కాలనీకి చెందిన ఎం.ఆనందరావు ఇంటిని కట్టేందుకు గౌరు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. లేబర్‌ను తీసుకొని ఇంటి స్లాబ్ పరిశీలించేందుకు పిట్ట గోడ ఎక్కాడు. దిగే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి కిందపడ్డాడు. తీవ్రంగా గాయాలు కావడంతో మరణించారు. మృతుని భార్య పైడితల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 14, 2025

ఇండియా-ఏ టీమ్ ప్రకటన.. అభిషేక్‌కు చోటు

image

ఆస్ట్రేలియా-ఏతో జరిగే మూడు వన్డేలకు ఇండియా-ఏ టీమ్‌ను BCCI ప్రకటించింది.
తొలి వన్డేకు(13 మంది): రజత్ పాటిదార్, ప్రభుసిమ్రన్, పరాగ్, బదోని, సూర్యాంశ్, విప్రజ్, నిశాంత్, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పొరెల్, ప్రియాంశ్, సిమర్జిత్ సింగ్.
2, 3 వన్డేలకు(15 మంది): ప్రియాంశ్, సిమర్జిత్ స్థానంలో తిలక్, అభిషేక్‌తో పాటు హర్షిత్, అర్ష్‌దీప్‌కు చోటు దక్కింది.
పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.