News March 25, 2024

అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహన్

image

ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పొలమూరి మోహన్ బాబు బీఎస్పీ తరఫున అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తనకు బీఎస్పీ పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News February 28, 2026

తూ.గో: పొట్టకూటి కోసం వెళ్తూ.. మృత్యవాత

image

తూ.గో. జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై లారీ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం(M) పాతబగ్గానికి చెందిన కొందరు సభ్యులు కృష్ణాజిల్లా గుడివాడ మినప చేలు తీత కోసం బయలుదేరి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్ర మత్తులో ఉండగా లారీ వెనక డోర్ పైనుంచి జారిపడి తలకు దెబ్బ తగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.

News February 28, 2026

ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ: ఎంపీ

image

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (సెర్వికల్‌ క్యాన్సర్‌) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.