News February 17, 2025
అమలాపురం: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
Similar News
News September 14, 2025
నకరికల్లు: కాలువలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

నకరికల్లు మండలం కుంకలగుంటలో శనివారం కాలువలో పడి గల్లంతైన రెండేళ్ల బాలుడి మృతదేహం <<17705891>>లభ్యమైంది<<>>. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం కుంకలగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని పంట కాలువలో బాలుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బాలుడు ఇంటి బయట అరుగుపై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News September 14, 2025
రసూల్‌పురా జంక్షన్ వద్ద రూ.150 కోట్లతో ఫ్లైఓవర్

గ్రేటర్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి రసూల్‌పురా జంక్షన్ వద్ద రూ.150 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. 4లేన్లతో, వై ఆకారంలో నిర్మించే ఈఫ్లైఓవర్‌కు GHMC టెండర్లు ఆహ్వానించింది. భూసేకరణకే దాదాపు రూ.70 కోట్లు ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
News September 14, 2025
బాపట్ల ఎస్పీగా ఉమామహేశ్వర్ బాధ్యతలు

బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసులు ముందుగా గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయంలో వేద పండితుల మధ్య బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పలువురు శుభాకాంక్షలు చెప్పారు.