News November 20, 2025

అమలాపురం: కిడ్నాప్ కథలో ట్విస్ట్.. చివరికి అరెస్ట్..!

image

అమలాపురంలో కలకలం రేపిన పదేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు మట్టపర్తి దుర్గా నాగసత్యమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బాలికకు వరుసకు మామయ్య అయిన సత్యమూర్తి ఈ నెల 10న పాపను బైక్‌పై తీసుకెళ్లి, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు డిమాండ్ చేశాడని సీఐ వీరబాబు తెలిపారు. బాలిక తండ్రి కముజు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News November 20, 2025

ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>ఇస్రో<<>> -ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్- B పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమాతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/

News November 20, 2025

IIT రామయ్య@100: CM చెప్పినా సీటిచ్చేవారు కాదు!

image

TG: విద్యారంగంలో చుక్కా రామయ్య ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. 1925 నవంబర్ 20న జనగామ జిల్లా గూడూరులో జన్మించారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి, కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. తర్వాత Hydలో IIT కోచింగ్ సెంటర్‌ స్థాపించారు. CM స్థాయి వ్యక్తులు రిఫర్ చేసినా సీటు ఇచ్చేవారు కాదని స్వయంగా CBN ఒకసారి చెప్పారు. రామయ్య ఉమ్మడి ఏపీలో MLCగానూ సేవలందించారు. ఇవాళ 100వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

News November 20, 2025

MDK: పెన్షన్ల పెంపు ఇంకెన్నడో ?

image

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని ఎన్నికల ముందు ప్రచార సభలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్ల కావొస్తున్నా పెన్షన్ పెంపు ముచ్చట లేదు. ఒంటరి మహిళలు, నేత కార్మికులు, వృద్ధులకు రూ.4,000 దివ్యాంగులకు రూ.6,000 వరకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 4,69,575 మంది పింఛన్ దారులు పెంపు కోసం ఎదురు చూస్తున్నారు.