News November 1, 2025

అమలాపురం: జిల్లా డీఐఈఓగా విజయశ్రీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా (డీఐఈఓ) రాజమండ్రి డీఐఈఓ డి.విజయశ్రీ శనివారం ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డీఐఈఓగా పనిచేసిన సోమశేఖర రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఆమె ఫుల్ అడిషనల్ ఛార్జ్ (ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా డీఐఈఓ విజయశ్రీ పేర్కొన్నారు.

Similar News

News November 2, 2025

ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే: KTR

image

TG: రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయని KTR వ్యాఖ్యానించారు. ‘500 రోజుల్లో KCR తిరిగి సీఎం అవుతారు. ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే. జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీతో గెలుస్తాం. రేవంత్ చేసే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పతనం ఖాయం. రేవంత్‌కు కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధం. BJPతో ఉన్న‌ది పేగు బంధం’ అని విమర్శించారు.

News November 2, 2025

BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

image

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఈజీ అశోక్ కుమార్‌ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.

News November 2, 2025

కొనసాగుతున్న కరీంనగర్ అర్బన్ ఎన్నికల కౌంటింగ్

image

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 12 డైరెక్టర్ స్థానాలకు 54 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పటిష్ట భద్రతా మధ్య కౌంటింగ్ కొనసాగుతుంది. అధికారులు పారదర్శకంగా లెక్కింపు చేపడుతున్నారు.