News March 18, 2025

అమలాపురం: ‘డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి’ 

image

మెగా డీఎస్సీ పేపర్లకే పరిమితమైందని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉమేశ్ అన్నారు. ఆరు నెలలకు గడుస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలేదన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3000 వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి రాకుమారికి వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. వేలాదిమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు.

Similar News

News March 1, 2026

భారత్‌లో ఖమేనీ పర్యటన.. ఎప్పుడో తెలుసా?

image

ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అవ్వకముందు భారత్‌లో పర్యటించారు. 41 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1980-81లో ఆయన కర్ణాటక, కశ్మీర్‌కు వచ్చారు. బెంగళూరుకు 75 కి.మీ. దూరంలోని అలీపుర్‌లో ఆస్పత్రిని ప్రారంభించారు. అక్కడ షియా ముస్లింల జనాభా అధికం. ఇక శ్రీనగర్‌లోని ఓ మసీదులో ప్రసంగించారు. మహత్మా గాంధీ, నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి నేతలను ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించి కొనియాడారు.

News March 1, 2026

ఫోన్‌లో సిమ్ ఉంటేనే ఈ యాప్స్ పనిచేస్తాయి!

image

ఇవాళ్టి నుంచి కొత్త టెలికం నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు మీ ఫోన్‌లోని సిమ్ కార్డ్‌తో కచ్చితంగా లింక్ అయి ఉండాలి. 6 గంటలకు ఒకసారి యాప్‌లు మీ ఫోన్‌లో సిమ్ ఉందో లేదో చెక్ చేస్తాయి. ఒకవేళ సిమ్ తీసివేస్తే అవి పనిచేయవు. అలాగే ఇకపై కంప్యూటర్ లేదా వెబ్‌లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి రీఅథెంటికేషన్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.

News March 1, 2026

TTD ఛైర్మన్ పదవి ఎవడబ్బ సొత్తు కాదు: BRనాయుడు

image

TTD ఛైర్మన్ పదవి ఎవడబ్బ సొత్తు కాదని, CM చంద్రబాబు చెబితేనే తాను పదవికి రిజైన్ చేస్తానని <<19270118>>BRనాయుడు<<>> అన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ రోజు నుంచే రాజీనామా చేయమని అడుగుతున్నారన్నారు. దీనిపై ఎందుకా అని ఆలోచిస్తే YCP చేసిన ఎన్నో అక్రమాలు బయటికి వస్తున్నాయన్నారు. తాను ఎక్కడా తగ్గేదేలే అన్నారు. వీడియోలో ఉన్న మహిళ కుటుంబానికి, తమ కుటుంబానికి 30 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.