News December 30, 2025
అమలాపురం: ‘దానా పథకం సత్ఫలితాలను ఇస్తోంది’

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలవుతున్న ‘దానా’ పథకం సత్ఫలితాలను ఇస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ, పీఏసీఎస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా పాడి రైతులకు చేకూరుతున్న లబ్ధి, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని, దీనిని మరింత సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 10, 2026
ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి

ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి. సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం. ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి. ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీకి కేటాయించారు.
News January 10, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,150 పెరిగి రూ.1,40,460కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050 ఎగబాకి రూ.1,28,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.7వేలు పెరిగి రూ.2,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 10, 2026
వేములవాడ: కుక్కను తప్పించబోయి యువకుడి మృతి

కుక్కను తప్పించే ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుండి అదుపుతప్పి పడిపోయిన వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన పోచంపల్లి అనిల్ (35) మృతి చెందాడు. నాంపల్లి శివారులో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనిల్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య అంజలి, ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు.


