News July 8, 2025
అమలాపురం: పీజీఆర్ఎస్ అర్జీలపై సమీక్ష

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై జాయింట్ కలెక్టర్ శాంతి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. వినతుల పురోగతిపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలను సంతృప్తి పరిచే విధంగా పరిష్కారం ఉండాలని అధికారులను ఆదేశించారు
Similar News
News July 8, 2025
బతుకమ్మ కుంట అభివృద్ధిపై అదనపు కలెక్టర్ ఫోకస్

జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంటను అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ ఈరోజు సందర్శించి, అక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని, స్ట్రీట్ లైట్స్ మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తూ పనులను పూర్తి చేయించాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.
News July 8, 2025
ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై ఇష్టం పెరుగుతుంది: జనగామ కలెక్టర్

జనగామ పట్టణంలోని ధర్మకంచలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో ఈరోజు సందర్శించి పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై ఇష్టం పెరుగుతుందని, క్రమశిక్షణ అలవర్చుకుని, సమయానికి భోజనం తిని, నిద్ర పోవాలన్నారు. క్రీడల్లో పాల్గొంటే మరింత ఆరోగ్యవంతులుగా తయారవుతారని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.
News July 8, 2025
గుంటూరు జిల్లాలో ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్

మత్తుపదార్థాల రహిత విద్యా వాతావరణం కోసం గుంటూరు జిల్లాలో “ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్” స్పెషల్ డ్రైవ్ మంగళవారం ప్రారంభమైంది. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల సమీపంలో ఉన్న షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల విక్రయంపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. సిగరెట్లు, గంజాయి విక్రయాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.