News February 6, 2026

అమలాపురం: బార్ల లైసెన్సులకు లాటరీ.. రూ.కోటి ఆదాయం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మద్యం బార్ల లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరింది. ఐదు బార్లకు గాను నాలుగు బార్లకు శుక్రవారం అమలాపురంలో లాటరీ తీశారు. అమలాపురంలో రెండు, రామచంద్రపురంలో రెండు బార్లకు కేటాయింపులు జరిగాయి. ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల చొప్పున DD తీయగా.. ముమ్మిడివరంలో ఏడుగురు, అమలాపురంలో ఐదుగురు, రామచంద్రపురంలో ఎనిమిది మంది పోటీ పడ్డారు.

Similar News

News February 22, 2026

జగిత్యాల: యథాతథంగా ‘ప్రజావాణి’ కార్యక్రమం

image

జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం యథాతథంగా ప్రజావాణి నిర్వహిస్తామని వెల్లడించారు. సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను నేరుగా స్వీకరిస్తామని చెప్పారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News February 22, 2026

పాకిస్థాన్ ఖాతాలో అవాంఛిత రికార్డు

image

T20WC సూపర్-8లో భాగంగా నిన్న న్యూజిలాండ్vsపాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక T20I మ్యాచ్‌లు(7) రద్దయిన జట్ల జాబితాలో అగ్రస్థానానికి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐర్లాండ్(6), న్యూజిలాండ్(6), ఇండియా(4), నెదర్లాండ్స్(4) ఉన్నాయి. నిన్న మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

News February 22, 2026

సిరిసిల్ల: అప్పుల బాధతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

image

ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్న ఘటన ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమనేని అంజయ్య (42) సొంత ఊరిలో ఉపాధి లేక హైదరాబాదులో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేశాడు. అప్పులు ఎక్కువ అవడంతో మనస్తాపం చెంది స్వగ్రామంలోని ఆయన ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.