News December 13, 2025

అమలాపురం మాజీ ఎంపీ కన్నుమూత

image

అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి(85) శనివారం తెల్లవారుజామున ఢిల్లీలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మూడు సార్లు ఎంపీగా ఎన్నికైయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామం అయినవిల్లి మండలం విలసలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Similar News

News December 15, 2025

MDK: గతంలో పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు ఉపసర్పంచ్

image

ఐదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడు, ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహించిన యువకుడు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల విజయ్ కుమార్ గ్రామంలో రెండో వార్డులో పోటీ చేసి 36 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో గత రాత్రి జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో విజయ్ కుమార్‌ను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News December 15, 2025

‘పెద్దపల్లి జిల్లాకు సెమీకండక్టర్ యూనిట్ ఇవ్వాలి’

image

జిల్లాకు సెమీకండక్టర్ యూనిట్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం ఇచ్చారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీకి సరిపడా వనరులు, స్కిల్డ్ యువత జిల్లాలో ఉన్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ పేర్కొన్నారు. గతంలోనే పెద్దపల్లికి రావాల్సిన ఇండస్ట్రీని చంద్రబాబును సంతోష పెట్టేందుకు APకి తరలించారన్నారు.

News December 15, 2025

300 పోస్టులు.. 3 రోజుల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు

image

OICL 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ DEC 18తో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పోస్టులను బట్టి డిగ్రీ, MA పీజీ గల వారు అర్హులు. జనవరిలో టైర్-1, ఫిబ్రవరిలో టైర్-2 ఎగ్జామ్స్ ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అధికారిక సైట్, అప్లికేషన్ కోసం IBPS సైట్ చూడండి.