News January 6, 2026

అమలాపురం మున్సిపాలిటీకి ‘ప్రథమ’ శ్రేణి హోదా!

image

అమలాపురం పురపాలక సంఘం స్థాయి పెరిగింది. ఈ పురపాలక సంఘాన్ని ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం నుంచి దీనికి సంబంధించిన అధికారిక లేఖ అందినట్లు కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. పట్టణాన్ని ప్రథమ శ్రేణిగా తీర్చిదిద్దేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన కృషి ఫలితమేనని పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 21, 2026

ప.గో: శ్రీవారి ఫొటోలతో ప్లకార్డులు.. MLA నాయకర్ ఫైర్

image

శాసన మండలిలో YCP ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన YCPకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానిస్తూ పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు.

News February 21, 2026

SRD: భయంగా ఉంది. చనిపోతాను: RTC డ్రైవర్

image

ఖేడ్ RTC డిపో డ్రైవర్ పాపయ్య అదృశ్యమైనట్లు హద్నూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆయన బైక్‌పై వెళ్తూ కూతురుతో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ.. భయంగా ఉంది. చనిపోతాను.. మీరంతా బాగుండాలని ఫోన్ కట్ చేసి మంజీరా నదిలో దూకినట్లు సమాచారం. ఘటన స్థలంలో పాపయ్యకు సంబంధించి వస్తువులు, బైకు, సెల్‌ఫోన్ గుర్తించి హద్నూర్ పోలీసులకు సమాచారమివ్వగా గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. మిస్సింగ్ కేసుతో దర్యాప్తు చేస్తున్నారు.

News February 21, 2026

కావలి: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

బిట్రగుంట – అల్లూరు రోడ్డు మధ్యలో శుక్రవారం రాత్రి సుమారు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినవారు కావలి GRP పోలీసులను సమాచారం అందించాలని కోరారు.