News March 28, 2025
అమలాపురం: రీసర్వే ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలి

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియ చట్టపరమైన సూత్రాల అనుగుణంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలోని మూడు డివిజన్లకు చెందిన ఎమ్మార్వోలు, డిప్యూటీ ఎమ్మార్వోలు,మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలతో రీసర్వే పై శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పైలెట్ కార్యక్రమం పూర్తయిందని సర్వేను ప్రారంభించాలన్నారు.
Similar News
News February 21, 2026
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రపై నాసా సంచలన రిపోర్టు!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ <<15733376>>అనివార్య కారణాలతో<<>> కొన్ని నెలలు స్పేస్‌లోనే ఉండిపోవడం తెలిసిందే. దీనిపై నాసా సంచలన రిపోర్టు రిలీజ్ చేసింది. స్టార్ లైనర్ వ్యోమనౌక తీవ్ర సాంకేతిక వైఫల్యాలకు లోనైందని తెలిపింది. అది ప్రాణాంతక వైఫల్యమని పేర్కొంటూ టైప్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను పక్కనపెట్టి ప్రయోగాన్ని చేపట్టేందుకు నాసా మేనేజర్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా గుర్తించింది.
News February 21, 2026
సునీతా విలియమ్స్ యాత్ర.. అప్పుడేమైంది?

నాసా రిపోర్టు ప్రకారం.. 2024 జూన్‌లో వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లగానే దానిని నడిపించే ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్య వచ్చింది. ISSకు చేరుకునే సరికి 5 థ్రస్టర్లు/మినీ ఇంజిన్లు పని చేయడం ఆగిపోయాయి. హీలియం లీకేజ్ మొదలైంది. అయితే డాకింగ్ జరగడంతో వ్యోమగాములు ISSలోకి వెళ్లగలిగారు. స్టార్ లైనర్‌ను ఖాళీగానే కిందికి తీసుకొచ్చారు. చివరికి 2025 మార్చిలో స్పేస్ ఎక్స్ నౌకలో సునీత, విల్మోర్ భూమికి చేరుకున్నారు.
News February 21, 2026
టైప్-ఏ ప్రమాదమంటే?

ఒక ప్రమాదానికి ఇచ్చే తీవ్రమైన లేబుల్ ‘టైప్ ఏ’. భారీగా ఆర్థిక, ప్రాణనష్టం వంటి పరిణామాలకు కారణమైనప్పుడు ‘టైప్-ఏ’గా నాసా పరిగణిస్తుంది. ఛాలెంజర్, కొలంబియా షటిల్ ప్రమాదాలు ఈ కేటగిరీలోకే వస్తాయి. 2003లో కొలంబియా స్పేస్ షిప్ భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు పేలిపోయింది. దీంతో భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా, మరో ఆరుగురు చనిపోయారు. ఛాలెంజర్ (1986) షటిల్ డిజాస్టర్‌లో ఏడుగురు చనిపోయారు.


