News October 31, 2025

అమలాపురం: విద్యార్థులకు అరుదైన అవకాశం

image

‘స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషన్ టు ఢిల్లీ’ కార్యక్రమానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారని డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా విద్యార్థినులు ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం అభినందనీయమన్నారు. పైడి కొండల రాజేశ్వరి, రాచకొండ సృజన, జ్ఞానపూర్ణ దేవి దీక్షిత, ఎంహెచ్ఎస్ వి అనూష ఎంపికైన వారిలో ఉన్నారని డీఈవో వెల్లడించారు.

Similar News

News October 31, 2025

అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరిన స్పీకర్

image

MLAల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని TG స్పీకర్ G ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.10 మంది MLAలకు నోటీసులివ్వగా 8 మంది స్పందించారు. వీరిలో 4గురి విచారణ ముగిసింది. SC విధించిన గడువు నేటితో ముగియడంతో మిగతా వారి విచారణకు సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరారు. నోటీసులకు స్పందించని ఇద్దరిపైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. కాగా కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.

News October 31, 2025

GNT: తప్పుడు ప్రచారాలపై పోలీస్ దృష్టి

image

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పోలీసులపై తప్పుడు పోస్టులు పెరగడంతో గుంటూరు పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనుంది. వాట్సాప్ గ్రూపుల్లో అధికారులను సభ్యులుగా చేర్చి బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న ఘటనలపై ఫిర్యాదులు రావడంతో 15 గ్రూపులను గుర్తించారు. తొలి దశలో 10 గ్రూప్ అడ్మిన్‌లకు నోటీసులు జారీ చేశారు. లాలాపేట, నగరంపాలెం, అరండల్‌పేట, పొన్నూరు, పెదకాకానిలో నివసించే అడ్మిన్‌లను విచారణకు పిలిపించారు.

News October 31, 2025

KNR: ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలి: కవిత

image

మొంథా ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల పరిహారం చెల్లించాలని జాగృతి అధ్యక్షరాలు కవిత డిమాండ్ చేశారు. KNR(D) తిమ్మాపూర్(M) నల్లగొండలో ఆమె IKP కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం తడిసినా, మొలకెత్తినా, బూజు పట్టినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో కోతలు ప్రారంభమై నెల కావస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించడం లేదన్నారు.