News October 7, 2025
అమలాపురం: 81 మందికి ఉద్యోగ ఉత్తర్వులు అందజేత

నిరుద్యోగ యువత ప్రగతి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస సంస్థ అవిరళ కృషి చేస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మినీ జాబ్ మేళాలో సుమారు 123 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరికి ముఖాముఖి ఇంటర్వ్యూలు, అర్హత ధ్రువ పత్రాల పరిశీలన చేశారు. 81 మందికి ఉద్యోగ ఉత్తర్వులను అందజేశారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 14, 2026
మావిగన్‌కు మద్దతు ఇస్తారా? లేదా?: బుగ్గన

మాజీ సీఎం వైఎస్ జగన ప్రతిపాదించిన మావిగన్‌ను హైదరాబాద్‌లో ఉంటూ కొందరు ప్రముఖులు వ్యతిరేకించడం విడ్డూరమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం, రెండు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మావిగన్‌కు మద్దతు ఇస్తారా? లేదా తేల్చాలని డిమాండ్ చేశారు.
News April 14, 2026
యుద్ధంతో రూ.25 లక్షల కోట్ల నష్టం: ఇరాన్

అమెరికా-ఇజ్రాయెల్‌తో 40 రోజులపాటు సాగిన యుద్ధం వల్ల తమకు రూ.25 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా ఎక్కువే నష్టం ఉండొచ్చని తెలిపింది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి ఈ మొత్తాన్ని పరిహారం కోరతామని ప్రకటించింది.
News April 14, 2026
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కలెక్టర్

పుట్టపర్తిలోని ఆర్వీ జానకి రామయ్య కళ్యాణ మండపంలో మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అధికారులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


