News December 22, 2025
అమలాపురం: PGRSకు 250 అర్జీలు

అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన PGRSకు 250 అర్జీలు అందాయని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, వసతుల కల్పన వంటి అంశాలపై ప్రజలు వినతులు అందజేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Similar News
News December 22, 2025
అక్షర బాటలో బాలయపల్లె ప్రాథమిక పాఠశాల ఆయమ్మ

కాశినాయన మండలం బాలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయాగా యంబడి బాల నాగమ్మ చాలా కాలంగా పనిచేస్తోంది. చదువంటే ఆమెకు మక్కువ కానీ పరిస్థితులు అనుకూలించక నిరక్షరాస్యురాలిగానే ఉంది. పాఠశాలలో విద్యార్థులను గమనించిన ఆమె తనకు కూడా అక్షరాలు నేర్చుకోవాలని ఉందని ఉపాధ్యాయుడు ఖాసీం వల్లికి తెలిపింది. స్పందించిన ఉపాధ్యాయుడు ఆయమ్మకి ‘రోజుకో అక్షరం’ నేర్పుతున్నారు. ఆయమ్మ సంతోషం వ్యక్తం చేసింది.
News December 22, 2025
నల్గొండ: 21 ఏళ్లకే సర్పంచ్‌గా బాధ్యత

ఆ యువతి 21 ఏళ్లకే సర్పంచ్‌గా ఎన్నికై ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో 21 ఏళ్ల కుర్మేటి పుష్పలత ప్రశాంత్ సర్పంచ్‌గా ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్‌గా గుర్తింపు పొందిన ఆమె గ్రామాభివృద్ధి, పారదర్శక పాలనతోపాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.
News December 22, 2025
MBNR: సేవా దృక్పథానికి నిదర్శనం జి.వెంకటస్వామి: ఎస్పీ: ఎస్పీ

సామాజిక అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన దివంగత మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అందరికీ చిరస్మరణీయుడని జిల్లా ఎస్పీ జానకి పేర్కొన్నారు. సోమవారం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యుడిగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ప్రదర్శించిన సేవాభావం నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శమని కొనియాడారు.


