News April 14, 2025

అమలాపురానికి చెందిన క్రీడాకారుడు వీర్రాజు మృతి

image

అమలాపురానికి చెందిన క్రీడాకారుడు బిళ్ల వీర్రాజు (65) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. పరుగుల రాజు వీర్రాజు క్రీడల్లో పరుగు పందెం అండర్-50, 60 విభాగాల్లో వందలాది బంగారు పతకాలు సాధించారు. అంబేడ్కర్ కోనసీమ క్రీడా వైభవాన్ని నలు దిశలు చాటి గుర్తింపు తెచ్చుకున్నారు. వీర్రాజు మృతి పట్ల క్రీడా అభిమానులు, క్రీడ సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు.

Similar News

News November 4, 2025

మన్నెగూడ – అప్ప జంక్షన్ రోడ్డు ప్రమాదాల హాట్‌స్పాట్!

image

మన్నెగూడ నుంచి అప్ప జంక్షన్ వరకు రోడ్డు ప్రమాదాలకు హాట్‌స్పాట్‌లుగా మారాయి. గత 2014 నుంచి 2025 వరకు జరిగిన గణాంకాల ప్రకారం, ఈ ప్రాంతాల్లో మొత్తం 3,058 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో 358 మంది మృతి చెందగా, మరో 2,030 మంది తీవ్రంగా గాయపడ్డారు.“ప్రాణాలు పోయాకే స్పందన ఎందుకు?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు నివారించేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News November 4, 2025

ప్రజా సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించండి: SP

image

ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 54 ఫిర్యాదులు స్వీకరించి, వాటిలో భూగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ స్పందనతో 7 రోజుల్లో పరిష్కారం కల్పించాలని సూచించారు.

News November 4, 2025

MBNR: U-14, 17 కరాటే.. నేడు ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-14, 17 విభాగంలో కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీఎఫ్ కార్యదర్శి Dr.ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. నవంబర్ 4న మహబూబ్‌నగర్‌లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్‌లో ఎంపికలు నిర్వహిస్తామని, అండర్-14 విభాగంలో 1.1.2012లో, అండర్-17 విభాగంలో 1.1.2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని, ఆసక్తిగల బాల, బాలికలు పీడీ నరసింహను (94928 94606) సంప్రదించాలన్నారు.