News January 27, 2026

అమల్లోకి ఎన్నికల కోడ్

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల <<18974641>>షెడ్యూల్ విడుదలైన<<>> నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SEC రాణి కుముదిని హెచ్చరించారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. 2996 వార్డులకు ఎన్నికలకు జరుగుతాయని తెలిపారు. 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేశామన్నారు.

Similar News

News January 27, 2026

గ్రహ దోషాలను దూరం చేసే ‘నెమలి ఈక’

image

నెమలి ఈకకు ప్రతికూల శక్తిని తొలగించి శుభాలను కలిగించే శక్తి ఉంటుది. అలాగే గ్రహ దోష నివారణకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందట. వివిధ రంగుల దారాలతో నిర్దిష్ట సంఖ్యలో ఈకలను కట్టి పూజిస్తే మంచి ఫలితాలుంటాయట. ‘రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి శనివారం 2 ఈకలను పూజించాలి. దిండు కింద పెట్టుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. దేవుడి గదిలో వీటిని ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయి’ అని జ్యోతిషులు సూచిస్తున్నారు.

News January 27, 2026

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఇన్ఫోసిస్ కొత్త రూల్స్

image

‘వర్క్ ఫ్రమ్ హోమ్’ రూల్స్‌ను ఇన్ఫోసిస్ కఠినతరం చేసింది. ఎక్స్‌ట్రా WFH అనుమతులపై పరిమితి విధించింది. ప్రస్తుతం నెలకు 10 రోజులు ఆఫీసుకు రావాలనే నిబంధన ఉంది. దాన్నుంచి కూడా మినహాయింపు కోరే వెసులుబాటు కొనసాగుతోంది. ఇక నుంచి 3 నెలల్లో కేవలం 5 రోజులు మాత్రమే అలా మినహాయింపు ఇస్తారు. ఉద్యోగి లేదా ఫ్యామిలీలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం మెడికల్ సర్టిఫికెట్ చూపించి పర్మిషన్ తీసుకోవచ్చు.

News January 27, 2026

‘CM’ అంటే కోల్ మాఫియా: KTR

image

TG: ఆధారాలతో సహా సింగరేణి కుంభకోణాన్ని బట్టబయలు చేశామని KTR పేర్కొన్నారు. ‘గవర్నర్‌ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చాం. సింగరేణి కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి విచారణ పేరిట ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. ఇవాళ CM అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి ఉంది. టెండర్లకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే సమాధానం లేదు’ అని వ్యాఖ్యానించారు.