News February 1, 2025

అమానుష ఘటన.. మరో 8 మంది అరెస్ట్

image

ప్రేమజంట పారిపోవడానికి సాయం చేసిందని ఆరోపిస్తూ బాలిక బంధువులు ఓ మహిళను వివస్త్రను చేసి, జుట్టు కత్తిరించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత నెల 15న మునిమడుగులో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఇప్పటి వరకు 20మంది నిందితులను అనంతపురం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 1, 2025

గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేజీ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 1, 2025

రాష్ట్రపతి భవన్‌లో తొలి వివాహం

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్ పీఎస్ఓ, CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా, మరో CRPF అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్‌ల పెళ్లి జరగనుంది. ఈ గౌరవప్రదమైన వేదికపై ఒక అధికారి వివాహాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. భవన్‌లోని మదర్ థెరెసా క్రౌన్ కాంప్లెక్స్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. వీరి పెళ్లికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక అనుమతి మంజూరు చేశారు.