News October 9, 2025
అమాయకుల చావుకు కారణం జగన్: పుల్లారావు

స్వప్రయోజనాలు, నీచ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి అమాయకులను చంపేస్తుంటే ప్రభుత్వం ఊరుకోదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఆయన హయాంలో రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ఏరులై పారించారని మండిపడ్డారు. అమాయకుల చావులకు కారణమైన జగన్, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మెడికల్ కాలేజీల నిర్మాణంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Similar News
News October 9, 2025
HYD: హైఅలర్ట్.. RTC X రోడ్ బంద్

BRS చలో బస్ భవన్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. RTC X రోడ్‌ను క్లోజ్ చేశారు. అశోక్‌నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, విద్యానగర్ నుంచి బస్ భవన్‌కు వెళ్లే మార్గాల్లో భారీకేడ్లు పెట్టారు. రోడ్లు మొత్తం క్లోజ్ అవడంతో ఉదయం ఉద్యోగాలకు బయల్దేరిన వారు అవస్థలు పడ్డారు. గల్లీలన్నీ తిరిగి.. తిరిగి గమ్య స్థానాలకు వెళ్లాల్సి వస్తోందని ఓ వాహనదారుడు Way2Newsకు తెలిపారు.

MHBD: స్థానిక అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు!

మహబూబాబాద్ జిల్లాలో రెండు విడతల్లో రానున్న స్థానిక సమరంలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న స్థానిక ఎన్నికలు ఎట్టకేలకు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 193 ఎంపీటీసీ, 18 జడ్పీటీసీ స్థానాలకు అన్ని పార్టీల అభ్యర్థులు తలపడనున్నారు. ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.