News January 19, 2025
అమిత్‌షా పర్యటనకు సర్వం సిద్ధం: మంత్రి కొలుసు

కేంద్రమంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొండపావులూరులోని NIDM, NDRF భవనాల వద్ద ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశామని కొలుసు చెప్పారు. బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాలు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల వద్ద పోలీసు అధికారులతో కలసి ఏర్పాట్లు పర్యవేక్షించామని మంత్రి కొలుసు పేర్కొన్నారు.
Similar News
News April 23, 2025
స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. విజయవాడకు చెందిన ఇద్దరు అరెస్ట్

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పాట్ సెంటర్‌పై అక్కడి పోలీసులు మంగళవారం దాడి చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వెళ్లి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.
News April 23, 2025
పెనమలూరు: ఉరి వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఉరివేసుకుని విద్యార్థిని మృతి చెందింది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతి (20) హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు.
News April 23, 2025
నేడే రిజల్ట్.. కృష్ణా జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కృష్ణా జిల్లాలో మొత్తం 25,259మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థులు 21,009, ప్రైవేట్, ఒకేషనల్ విద్యార్థులు 4,250 మంది ఉన్నారు. నేడు విడుదలయ్యే పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.