News September 6, 2025
అమీన్‌పూర్‌లోనే నవోదయ పాఠశాల: ఎంపీ

సంగారెడ్డి జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలను అమీన్‌పూర్‌లోనే ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై నవోదయ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరాకు శనివారం వినతిపత్రం సమర్పించారు. పాఠశాల నిర్మాణం కోసం రూ.1500 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. అధికారులు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు.
Similar News
News September 6, 2025
KMM: శోభాయాత్ర, నిమజ్జనాలకు కట్టుదిట్టమైన బందోబస్తు

ఖమ్మం నగరంలో శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల కోసం ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు.
News September 6, 2025
ప్రకాశం: హిజ్రాలకు గుడ్ న్యూస్.. ఈ శిక్షణ వారికే.!

ప్రకాశం జిల్లాలోని హిజ్రాలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒంగోలులో తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన హిజ్రాలకు జాతీయస్థాయి IT రంగాల్లో నైపుణ్యత పెంచేందుకై ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు
ఇవ్వాలన్నారు.
News September 6, 2025
గణేష్ ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలి: జిల్లా ఎస్పీ

కాగజ్‌నగర్ పట్టణంలో నేడు జరగబోయే నిమజ్జన ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జన ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు, భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని తెలిపారు. నిమజ్జన సమయంలో తొందరపాటు పనికిరాదన్నారు.