News October 4, 2025
అమృత్ పనులు వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్

అమృత్ పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ వద్ద అమృత్ పథకం పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై పబ్లిక్ హెల్త్, నగర పాలక సంస్థ, టిడ్కో అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. మొదటి దశ పనులు నెల రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News October 4, 2025
యాడికి: బాలిక అదృశ్యంపై కేసు నమోదు

యాడికి మండలానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైనట్లు శుక్రవారం రాత్రి సీఐ వీరన్న తెలిపారు. విద్యార్థిని యాడికిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఉదయం బస్సులో స్కూల్‌కి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. బాలిక తండ్రి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 3, 2025
‘చెరువులకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి’

జిల్లాలో 301 చెరువులకు నీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హెచ్ఎల్‌సీ, మైనర్ ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హెచ్ఎస్ఎస్ఎస్, హెచ్ఎల్‌సీ కింద ఉన్న చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరితగతిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
News October 2, 2025
ఉరవకొండలో గొంతు కోసుకున్న వ్యక్తి

ఉరవకొండలోని పాల్తూరు రోడ్డు సమీపంలోని పొలాల్లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అత్యవసర వాహనాలకు సమాచారం అందించారు. వాహనాలు అందుబాటులోకి రాకపోవడంతో స్థానిక చారిటబుల్ ట్రస్ట్ అధినేతే కేశన్న తన సొంత వాహనంలో క్షతగాత్రుడిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.