News July 25, 2024
అమృత్ స్టేషన్ల జాబితాలో నెల్లూరుకు చోటు
దేశంలో 73 రైల్వేస్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే శాఖమంత్రి అశ్వినీవైష్ణవ్ పార్లమెంట్‌లో ప్రకరించారు. వీటిలో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ ఉందని తెలిపారు. దీంతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కలగనున్నాయి. ఇప్పటికే రూ.102కోట్లతో నెల్లూరు రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీనితో పాటు గూడూరు, సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి
Similar News
News January 17, 2025
2 నెలల పాటు అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేత
రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల పాటు అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు జిల్లా రిజిస్టర్ బాలాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
News January 17, 2025
నెల్లూరు: ఆర్నెల్ల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం
సరదాగా గడిపి సేదతీరేందుకు వెళ్లిన ముగ్గురిని కడలి బలితీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ(25)కు, నెల్లూరు జిల్లా, కందుకూరు(M), అనంతసాగరానికి చెందిన నవ్వతో ఆర్నెల్ల క్రితం పెళ్లి అయ్యింది. సంక్రాంతి సందర్భంగా బంధువులు, స్నేహితులతో కలిసి వారు పాకల బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో అలల్లో చిక్కుకుని మాధవ, నవ్య సోదరి యామిని, మాధవ బాబాయ్ కుమార్తె జెస్సికా మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
News January 17, 2025
నెల్లూరు: గుండెపోటుతో MLA తమ్ముడి మృతి
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు కురుగొండ్ల శేఖర్ కన్నుమూశారు. డక్కిలి మండలం కమ్మవారిపల్లికి చెందిన శేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గుంటూరులో స్థిరపడ్డారు. ఈక్రమంలో నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే గుంటూరుకు బయల్దేరారు.