News December 16, 2025

అమెనోరియా సమస్యకు కారణమిదే!

image

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.

Similar News

News December 30, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*అసెంబ్లీలో కేసీఆర్‌ను పలకరించిన CM రేవంత్
*ఏపీలో 28 జిల్లాలు ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం.. జనవరి 1నుంచి అమలులోకి
*రాయచోటి ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు
*మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి ఎక్స్‌ప్రెస్ వే
*ఉన్నావ్ రేప్ కేసు.. సెంగార్‌ను విడుదల చేయొద్దన్న సుప్రీంకోర్టు
*FIDE వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలిచిన హంపి, అర్జున్ ఎరిగైసి

News December 30, 2025

గౌరవం ఇచ్చి పుచ్చుకునేది: KTR

image

TG: అసెంబ్లీలో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ <<18701442>>కరచాలనం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో లేచి నిలబడకపోవడంతో KTRపై విమర్శలొచ్చాయి. వాటికి ఆయన తనదైనశైలిలో సమాధానం చెప్పారు. ‘నేను వ్యక్తులను బ్యాడ్‌గా ట్రీట్ చేయను. వాళ్లు ఎలా ఉంటారో అలాగే ట్రీట్ చేస్తాను’ అన్న కొటేషన్ షేర్ చేశారు. దానికి ‘గౌరవాన్ని గెలుచుకోవాలి.. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడకూడదు’ అని క్యాప్షన్ పెట్టారు.

News December 30, 2025

హైదరాబాద్‌లో కొత్త కమిషనరేట్లు.. ఐపీఎస్‌ల బదిలీలు

image

HYDలో కమిషనరేట్లను ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ(రాచకొండ స్థానంలో), మల్కాజిగిరి కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. దీంతో పలువురు IPSలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. HYD ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు(ఫొటోలో), మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీగా ఎం.రమేశ్, యాదాద్రి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌ను నియమించింది.