News April 20, 2025
అమెరికాలో కుంద్రురు యువకుడు మృతి

సంతమాగులూరు మండలంలోని కుందుర్రుకి చెందిన బోడేపూడి రాజబాబు కుమారుడు అవినాష్ అమెరికాలో మృతి చెందడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏప్రిల్ 13న అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్‌తో అవినాశ్ మరణించాడు. ప్రస్తుతం వారి కుటుంబం గుంటూరులో ఉంటుండగా.. శనివారం మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకువచ్చి గుంటూరులోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా అవినాశ్‌కు నెల క్రితమే వివాహమైంది.
Similar News
News April 20, 2025
పెనమలూరు: రూ. 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తాడిగడపకు చెందిన నూకల విజయశ్రీని సైబర్ నేరగాళ్లు భారీ మోసం చేశారు. ఆన్‌లైన్ టాస్కుల పేరుతో గ్రూపుల్లో చేర్చి, పెట్టుబడికి అధిక లాభాలంటూ నమ్మబలికిన నేరస్తులు దశలవారీగా ఆమె నుంచి రూ.22 లక్షలు దోచుకున్నారు. స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 20, 2025
NLG: మన పనుల్లో ఉత్తరాది కూలీలు..!

ఉమ్మడి NLG జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు గణనీయంగా పెరిగారు. ప్రతి రంగంలో వారి ఉనికి కనిపిస్తోంది. సుమారు 6వేల మంది వరకు కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు అంచనా. హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం, ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా బీహార్, UP, ఢిల్లీ వాళ్లు పని చేస్తున్నారు.
News April 20, 2025
అవార్డు అందుకొనున్న ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈ నెల 21న ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకొనున్నారు. నార్నూర్‌లోని బ్లాక్ ‘ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్’ విభాగంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో శ్రేష్ఠతకు గాను ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే సివిల్ సర్వీసెస్‌డే రోజున ఆయన ఈ అవార్డు అందుకొనున్నారు.