News June 30, 2024
అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్ (20) శనివారం అమెరికాలో మృతి చెందాడు. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలో మిస్సోరీ స్టేట్‌లో ఉన్న శ్యాండిల్ ఎస్ టౌన్‌లో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. గతేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లిన కిరణ్ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో మునిగి చనిపోయాడు.
Similar News
News September 19, 2025
ఖమ్మం: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన కలెక్టర్

రాపర్తి నగర్‌లోని TGMRJC బాలికల జూనియర్ కళాశాలలో నిట్, ఐఐటీ ఆశావహ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడి తన అనుభవాలను పంచుకున్నారు. ఇంటర్‌లో కృషి చేస్తే మంచి కెరీర్ సాధ్యమని, పోటీ పరీక్షల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
News September 18, 2025
ఖమ్మం: ‘పదవి ముగిసిన.. బాధ్యతలకు ముగింపు లేదు’

సర్పంచ్ పదవి కాలం ముగిసి 20 నెలలు కావొస్తున్న.. రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడు గ్రామ మాజీ సర్పంచ్ షేక్ మీరా సాహెబ్ మాత్రం తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ అనేక పనులు చేయిస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. వీధులను శుభ్రం చేయించడం, బ్లీచింగ్ చల్లించడం, పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కల నివారణకు కలుపు మందు పిచికారి చేయించడం వంటి ఎన్నో పనులు చేపిస్తూ ఉన్నారు.
News September 18, 2025
ఖమ్మం పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ₹18 కోట్లు

ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ప్రభుత్వం ₹18 కోట్లు మంజూరు చేసింది. పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి ఈ మేరకు జీఓ నెం.51ని విడుదల చేశారు. వెలుగుమట్ల పార్కు అభివృద్ధి, నిర్వహణకు ₹3 కోట్లు, ఖిల్లా రోప్‌వే, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ₹15 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.